శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 00:58:44

పిగ్‌ బ్రీడింగ్‌ పాలసీ అవసరం

పిగ్‌ బ్రీడింగ్‌ పాలసీ అవసరం
  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ను కోరిన కెనడా, తెలంగాణ ప్రతినిధులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం పిగ్‌ బ్రీడింగ్‌ పాలసీని రూపొందించేలా చర్యలు తీసుకోవాలని కెనడా, తెలంగాణ ప్రతినిధులు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ను కోరారు. కెనడాకు చెందిన పోలార్‌ జెనెటిక్స్‌ అధ్యక్షుడు అల్ఫ్రెడ్‌ వాల్‌, తెలంగాణ రాష్ట్ర సౌజన్య ఫార్మ్స్‌ అధినేత సాగర్‌ శుక్రవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో వినోద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పిగ్‌ ఫార్మింగ్‌కు తెలంగాణ ఎంతో అనువైన ప్రదేశమని చెప్పారు. ఫార్మింగ్‌ చేపట్టి వాటి మాంసాన్ని ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. పిగ్‌ బ్రీడింగ్‌ పాలసీని ఖరారుచేసి కేంద్రానికి పంపేలా చర్యలు తీసుకోవాలని కెనడా, తెలంగాణ ప్రతినిధులు వినోద్‌కుమార్‌ను కోరారు. దీనిపై స్పందించిన వినోద్‌కుమార్‌.. రాష్ట్ర పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. సత్వరమే పిగ్‌ బ్రీడింగ్‌ పాలసీని రూపొందించాలని సూచించారు.


logo