ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:46:53

2 నుంచి మాదిగల రథయాత్ర

2 నుంచి మాదిగల రథయాత్ర

ఖైరతాబాద్‌, జనవరి 12: కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు మాదిగలకు చేసిన మోసాన్ని పౌర సమాజంలో ఎండగట్టేందుకు ఫిబ్రవరి రెండు నుంచి మాదిగల రథయాత్ర చేపట్టనున్నట్టు ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, మాదిగ సంఘాల జేఏసీ కోఆర్డినేటర్‌ పిడమర్తి రవి చెప్పారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద రెండున యాత్ర ప్రారంభమై, 17న యాదాద్రి భువనగిరి జిల్లాలో ముగుస్తుందని తెలిపారు. మంద కృష్ణ నాగార్జునసాగర్‌ నుంచి పోటీ చేస్తామనడం మాదిగలను మరోసారి మభ్యపెట్టడమేనని అన్నారు. దమ్ముంటే తిరుపతి నుంచి పోటీచేసి గెలిచిన తర్వాత పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణపై చర్చించాలని డిమాండ్‌చేశారు. దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ సర్కారు, అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న బీజేపీ ప్రభుత్వం కూడా మాదిగలను మోసం చేశాయని మండిపడ్డారు. సమావేశంలో మాదిగ సంఘాల నేతలు రాయకంటి రాందాస్‌,  నర్సింగ్‌రావు, రాంబాబు బాలరాజు, మైసా ఉపేందర్‌, యాదయ్య, సంతోష్‌, వినాయక్‌రావు తదితరులు పాల్గొన్నారు.