బుధవారం 20 జనవరి 2021
Telangana - Feb 07, 2020 , 01:37:28

వర్గీకరణపై కేంద్రం మోసం

వర్గీకరణపై కేంద్రం మోసం
  • రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి
  • దళితసంఘాల కన్వీనర్‌ పిడమర్తి రవి

తార్నాక: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం వైఖరికి నిరసనగా శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టు ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, దళిత సంఘాల కన్వీనర్‌ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. గురువారం ఆయన తార్నాకలో మీడియాతో మాట్లాడుతూ.. వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నదని మండిపడ్డారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు వర్గీకరణ అంశాన్ని లేవనెత్తినా బీజేపీ నోరుమెదపడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీలు మాదిగలను మోసం చేశాయని ఆరోపించారు. ముట్టడి కార్యక్రమంలో మాదిగలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో దళితసంఘాల నాయకులు మైస ఉపేందర్‌, నర్సింగరావు  తదితరులు పాల్గొన్నారు.logo