బుధవారం 03 జూన్ 2020
Telangana - May 22, 2020 , 12:43:44

పుచ్చకాయలపై ప్రముఖుల చిత్రాలు

పుచ్చకాయలపై ప్రముఖుల చిత్రాలు

నిజామాబాద్ : అగ్గిపుల్ల, సబ్బుబిల్ల కవిత్వానికి కాదేది అనర్హం అన్నట్లు జిల్లాలోని గంగస్థాన్ చెందిన సుజన్ కుమార్ పుచ్చకాయలపై ప్రముఖుల చిత్రాలు గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ కవిత చిత్రాలను అందంగా తీర్చిదిద్ది పలువురి మన్ననలు పొందుతున్నాడు. తన కళ తో పుచ్చకాయల పై వివిధ ప్రముఖుల బొమ్మలను వేస్తున్నాడు. గతంలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులో నేర్చుకున్న ఈ కలను లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే  కాలక్షేపం చేస్తూ ఇలా పుచ్చకాయ పై తన కలను ప్రదర్శిస్తున్నాడు.
logo