గురువారం 02 జూలై 2020
Telangana - Mar 28, 2020 , 14:19:09

సీఎంఆర్‌ఎఫ్‌కు దివ్యాంగుడి నెల పింఛన్‌ విరాళం.. కేటీఆర్‌ ప్రశంస

సీఎంఆర్‌ఎఫ్‌కు దివ్యాంగుడి నెల పింఛన్‌ విరాళం.. కేటీఆర్‌ ప్రశంస

కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఓ దివ్యాంగుడు తన నెల పింఛన్‌ విరాళంగా అందజేశాడు. కాగజ్‌నగర్‌ పట్టణం బాలాజీనగర్‌కు చెందిన బండివాసు అనే దివ్యాంగుడు కరోనా బాధితుల సహాయార్థం తన ఒక నెల పెన్షన్‌ రూ.3016 ను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు పంపించాడు. ఈ అంశాన్ని తెలియజేస్తూ బండివాసు ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు, సినీ హీరో రాంచరణ్‌ కు ట్యాగ్‌ చేశాడు. స్పందించిన మంత్రి కేటీఆర్‌ మీ స్పందన అద్భుతమని కొనియాడారు. హీరో రామ్‌చరణ్‌ బండివాసుకు అభినందనలు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, రాష్ట్ర ప్రజల యోగక్షేమాలకుగాను పలువురు వ్యాపార, సినీ ప్రముఖులు, దాతలు తమ వంతూ చేయూతను ప్రభుత్వానికి అందిస్తున్నారు.


logo