బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 06:56:35

బీట్ ఆఫీసర్ పోస్టులకు ఫిజికల్ టెస్ట్

బీట్ ఆఫీసర్ పోస్టులకు ఫిజికల్ టెస్ట్

హైదరాబాద్‌: హైకోర్టు ఆదేశాల మేరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల్లో రీలింక్విష్మెంట్ ఇచ్చుకున్న వారి స్థానంలో తదుపరి అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. వీరికోసం నాలుగో విడుత ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 12 వరకు స్థానిక జిల్లాల్లో ఈవెంట్స్ ఉంటాయని స్పష్టం చేసింది. హాల్‌టికెట్, ఫొటో ఐడీ ఇతర వివరాలతో ఉదయం 5.15 గంటలకు హాజరు కావాలని కోరింది. పరీక్షల షెడ్యూల్ వంటివివరాల కోసం వెబ్‌సైట్‌లో చూడ‌వ‌చ్చ‌ని అభ్యర్థులకు సూచించింది.