శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 18:04:30

పారిశుద్ధ్య పనుల ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి

పారిశుద్ధ్య పనుల ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి

కరీంనగర్‌ : గ్రామాల్లో జరిగే పారిశుద్ధ్య పనులను ఫోటోలు తీసి పల్లె ప్రగతి మొబైల్‌ యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలని స్వచ్ఛ భారత్‌ మిషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ జితేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం మహాత్మానగర్‌, కొత్తపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి శానిటైజేషన్‌ మొబైల్‌ యాప్‌ పనితీరును ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను యాప్‌ ద్వారా క్యాప్షర్‌ చేయాలని, వీటిని మండల పంచాయతీ అధికారి ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. గ్రామస్థాయిలో సర్పంచ్‌లు ప్రత్యేక చొరవ చూపించాలన్నారు. పల్లె ప్రగతి యాప్‌ ద్వారా ప్రతి పనిని క్యాప్చర్‌ చేసి స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. ఆయన వెంట సర్పంచ్‌లు ఇనుకొండ జితేందర్‌రెడ్డి, జక్కని శ్రీవాణి, ఎంపీవో కిరణ్‌, తదితరులు ఉన్నారు.