మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 03, 2020 , 01:33:00

పస్రాలో ఫొటో జర్నలిస్టు దారుణ హత్య

పస్రాలో ఫొటో జర్నలిస్టు దారుణ హత్య

గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్రా గ్రామంలో వరంగల్‌కు చెంది న ఫొటో జర్నలిస్టు బొమ్మినేని సునీల్‌రెడ్డి(40) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకా రం.. హన్మకొండకు చెందిన దేవేందర్‌రెడ్డి పస్రాలోని బెంగళూరు బేకరి యజమాని దయాకు రూ.6 లక్షలు అప్పుగా ఇచ్చా డు. డబ్బులు చెల్లించాలని ఎన్నిసార్లు కోరిన దయా సమాధానం ఇవ్వకపోవడంతో సోమవారం దేవేందర్‌రెడ్డి తన స్నేహితుడైన సునీల్‌రెడ్డిని పస్రాకు తీసుకువచ్చాడు. దయా వద్దకు వెళ్లిన తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా తనకు వెంకన్న అనే చిట్టి వ్యాపారి డబ్బులు ఇవ్వాలని చెప్పడంతో దయాతోపాటు సునీల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి కలిసి వెళ్లారు. తాను చిట్టి డబ్బులు కొన్ని దయాకు ఇచ్చానని, ఇంకా ఏమైనా బకాయి ఉంటే బిడ్డ పెండ్లి తర్వాత ఇస్తానని వెంకన్న చెప్పడంతో ఈ ముగ్గురు తిరిగి బేకరీకి చేరుకున్నారు. ఈ క్రమంలో బేకరీలో దేవేందర్‌రెడ్డి-దయా మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా దయా దేవేందర్‌రెడ్డిపై కత్తితో దాడి చేసి గాయపర్చినట్టు తెలుస్తున్నది. అనంతరం దయా తన బేకరీ ముందు ఉన్న సునీల్‌రెడ్డిని మాట్లాడుదామని ఇంట్లోకి తీసుకెళ్లి గొంతుకోయడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందగా దేవేందర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని దవాఖానకు తరలించారు. సంఘటన స్థలాన్ని ములుగు ఏఎస్పీ సాయిచైతన్య సందర్శించారు. పస్రా సీఐ అనుముల శ్రీనివాస్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.logo
>>>>>>