శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 11, 2020 , 15:48:36

వరంగల్‌ ఎంపీకి ఉప రాష్ట్రపతి ఫోన్

వరంగల్‌ ఎంపీకి ఉప రాష్ట్రపతి ఫోన్

వరంగల్ అర్బన్ : వరంగల్ లో కరోనా పరిస్థితి పై వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ కు ఉప రాష్ట్రపతి  వెంకయ్యనాయుడు ఫోన్‌ చేశారు. జిల్లాలో కరోనా నివారణ చర్యలపై ఆరా తీశారు.  ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ముందు చూపు, అధికారుల కృషితో వరంగల్‌లో కరోనా నియంత్రణ సాధ్యమైందని వెంకయ్యనాయుడుకు వివరించినట్లు తెలిపారు. అయినప్పటికి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి సూచించినట్లు పేర్కొన్నారు.


logo