మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 17:06:58

పాలిటెక్నిక్ మొద‌టి విడుత సీట్ల కేటాయింపు

పాలిటెక్నిక్ మొద‌టి విడుత సీట్ల కేటాయింపు

హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్ర‌వేశాల‌కు సంబంధించి మొద‌టి విడుత సీట్ల‌ను కేటాయించిన‌ట్లు సాంకేతిక విద్యాశాఖ క‌మిష‌న‌ర్ న‌వీన్ మిట్ట‌ల్ ప్ర‌క‌టించారు. మొద‌టి విడుత‌లో భాగంగా 22,064 సీట్ల‌ను భ‌ర్తీ చేశారు. తొలి విడుత కేటాయింపు త‌ర్వాత 8,948 సీట్లు మిగిలాయి. సీటు పొందిన విద్యార్థులు.. ఈ నెల 26వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి రిపోర్టింగ్ చేయాల‌ని క‌మిష‌న‌ర్ సూచించారు. వ‌చ్చే నెల 5, 6 తేదీల్లో కాలేజీల్లో చేరాల‌ని చెప్పారు. 

టీఎస్‌ పాలిసెట్ ఫలితాలు సెప్టెంబ‌ర్ 2వ తేదీన విడుద‌లైన విష‌యం తెలిసిందే. పాలిటెక్నిక్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 81.14% ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికల శాతం 84.93 ఉండగా.. బాలురు 78.72 శాతం ఉన్నారు. మొత్తం 73,920 మంది దరఖాస్తుచేసుకోగా.. 56,945 మంది పరీక్షలకు హాజరయ్యారు. 46,207 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్‌ విభాగంలో 46,318 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇక్కడ కూడా బాలికలే సత్తా చాటారు. బాలురు 78.40 శాతం, బాలికలు 85.93 శాతం ఉత్తీర్ణత సాధించారు. 


logo