మంగళవారం 02 జూన్ 2020
Telangana - Feb 29, 2020 , 18:41:41

ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌: నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అలకపురిలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్న సమయం నుంచి తలుపులు తీయకపోవడంతో హాస్టల్‌ నిర్వహకులు కిటికీ నుంచి చూడగా ఫ్యానుకు ఉరివేసుకుని విద్యార్థిని కనిపించింది. హాస్టల్‌ వార్డెన్‌ సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు యాదగిరిగుట్టుకు చెందిన తేజస్వినిగా గుర్తించారు. 


logo