గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 01:42:31

‘నిమిషం’పై పిల్‌

‘నిమిషం’పై పిల్‌
  • ఇంటర్‌ విద్యార్థులు ఈ నిబంధనతో ఇబ్బంది పడుతున్నారన్న పిటిషనర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరిస్తూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇంటర్మీడియట్‌ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఏడాదిపాటు చదివి, సన్నద్ధమైన విద్యార్థులు నిమిషం నిబంధన కారణంగా పరీక్షకు హాజరుకాలేకపోతున్నారని, ఎంతో ఆందోళనకు గురవుతున్నారని పిటిషనర్‌ రాపోలు భాస్కర్‌ పేర్కొన్నారు. ఆలస్యం పేరుతో విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమేనని వివరించారు. ఈ నిబంధనను తొలగించి, ఆలస్యం కారణంగా పరీక్షలు రాయలేకపోయినవారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తిచేశారు. నిమిషం ఆలస్యం కారణంగా ఎందరు పరీక్షలు రాయలేకపోయారనే వివరాలు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. విచారణను బుధవారానికి వాయిదావేసింది. 


logo
>>>>>>