గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 04:41:53

గెస్ట్‌ ఫ్యాకల్టీల పిటిషన్‌ కొట్టివేత

గెస్ట్‌ ఫ్యాకల్టీల పిటిషన్‌ కొట్టివేత

  • తాత్కాలికత..చట్టబద్ధ హక్కుకాదన్న హైకోర్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒక పోస్టులో తా త్కాలిక ప్రాతిపదికన ఎవరి నైనా నియమిస్తే వారికి చట్టబద్ధ హక్కులు ఉండవని హై కోర్టు స్పష్టంచేసింది. తాత్కాలిక పోస్టుల్లో ఏ అర్హతల ప్రాతిపదికన నియమించాలనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆ ధారపడి ఉంటుందని పేర్కొన్నది. 2018-19 విద్యాసంవత్సరానికి ముందు గెస్ట్‌లెక్చరర్‌ పోస్టులు ఆటోమేటిక్‌గా రెన్యువల్‌ అయ్యేవి. గతేడాది జూన్‌లో పీజీలో అభ్యర్థుల మెరిట్‌ ఆధారంగా గెస్ట్‌ లెక్చరర్లను తీసుకోవాలని ఇంటర్‌ బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తమ ఉద్యోగాలు పోతాయని, అనుభవం దృష్ట్యా తమనే కొనసాగించాలని వరంగల్‌కు చెందిన పలువురు పిటిషన్లు దాఖలుచేశారు. వీటిపై శనివారం విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం... సింగిల్‌ జడ్జి తీర్పును ధ్రువీకరిస్తూ అప్పీల్‌ పిటిషన్లను కొట్టేసింది. సరైన ఉద్యోగిని ఎంపిక చేసుకోవడం, యజమాని విచక్షణపై ఆధారపడి ఉం టుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలను కోర్టులు తప్పుబట్టలేవని పేర్కొన్నది. logo