సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 10, 2020 , 08:51:35

కత్తితో పొడిచి వ్యక్తి దారుణ హత్య

కత్తితో పొడిచి వ్యక్తి దారుణ హత్య

వరంగల్‌ రూరల్‌: జిల్లాలోని గీసుకొండ మండలం జాన్‌పాకలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని సాయివైన్స్‌లో పనిచేస్తున్న రమేశ్‌కు, వైన్స్‌ పక్కనే ఉన్న పాన్‌ షాప్‌ ఓనర్‌ ప్రభాకర్‌కు మధ్య ఘర్షణ జరిగింది. రమేశ్‌పై ప్రభాకర్‌ కత్తితో దాడి చేసి గొంతువద్ద పొడవడంతో రమేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మామునూర్‌ ఏసీసీ శ్యాంసుందర్‌, గీసుకొండ ఎస్సై శివరామయ్య ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.


logo