బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 15:37:39

తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి..

తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి..

నారాయణపేట: జిల్లా కేంద్రంలోని పళ్లబురుజు ప్రాంతంలో 8 మందిపై తేనెటీగలు మూకుమ్మడిగా దాడిచేశాయి. ఈ దాడిలో కథలప్ప(44) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించడంతో అతడు మరణించాడు. అలాగే, స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నాగారాజు అనే బాలుడు కూడా తేనెటీగల దాడిలో తీవ్రగాయాలపాలయ్యాడు. మిగితా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దాడిలో గాయపడిన వారిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారికి.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు తేనెతెట్టెపై రాళ్లు రువ్వడంతోనే తేనెటీగలు దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.


logo
>>>>>>