శనివారం 30 మే 2020
Telangana - Mar 30, 2020 , 06:17:01

పండ్ల మార్కెట్లో క్రయవిక్రయాలకు అనుమతి

పండ్ల మార్కెట్లో క్రయవిక్రయాలకు అనుమతి

హైదరాబాద్ : గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌  మార్కెట్‌ యార్డులో పండ్ల క్రయవిక్రయాలకు అనుమ తులు ఉన్నాయని అధికారులు కమీషన్‌ ఏజెంట్లతో పాటు రైతులకు సమాచారం అందిస్తున్నారు.పండ్ల వాహనాలను ఆపకుండా ఉండేందుకు అత్యవసర సేవలు అందించే వారు ఫోన్‌ నంబర్లు 040-23450624, 04023450735 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు. యార్డుకు ఆదివారం వాటర్‌మిలన్‌ 50 వాహనాలు, సంత్రా 15 డీసీఎంలు, గ్రేప్‌ బాక్సులు 12వేలు, దానిమ్మ 100 బాక్సులు, మామిడి 30 టన్నులు వచ్చాయి. మార్కెట్ లో సమాజిక దూరం పాటించేలా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. 


logo