గురువారం 16 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 16:28:47

ప్రభుత్వ కట్టడాల కోసం ఇసుక‌కు అనుమ‌తులివ్వండి

ప్రభుత్వ కట్టడాల కోసం ఇసుక‌కు అనుమ‌తులివ్వండి

మ‌హ‌బూబాబాద్ : ఇక ఉపాధి హామీ నిధుల‌ను పారిశుద్ధ్యంతోపాటు ప‌లు వ్యవసాయ అనుబంధ ప‌నుల‌కు కూడా ఉప‌యోగించాల‌ని, ఆ నిధుల‌ను వినియోగించ‌లేని అధికారుల‌పై చర్యలు తప్పవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. తొర్రూరులో ప‌లు చోట్ల హ‌రితహారంలో మొక్కలు నాటిన అనంతరం పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తొర్రూరు, పెదవంగ‌ర మండ‌లాల ప‌లు అభివృద్ధి ప‌నుల‌పై అధికారుల‌తో స‌మీక్షించారు.

హ‌రిత హారం కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని, చెట్టు న‌రికితే జ‌రిమానాలు విధించాల‌ని ఆదేశిస్తూనే, ప‌ల్లె, ప‌ట్టణ ప్రగతి కార్యక్రమాలు విజ‌య‌వంతం కావాల‌న్నారు. అలాగే ప్రభుత్వ కట్టడాలకు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇసుక కొర‌త స‌మ‌స్య రాకూడ‌ద‌ని, ఇసుక వినియోగం దుర్వినియోగం కాకుండా, అనుమ‌తులివ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. క‌రోనా వైర‌స్ విస్తృతి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌న్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.


logo