బుధవారం 03 జూన్ 2020
Telangana - May 05, 2020 , 23:45:54

27 జిల్లాల్లో అన్ని షాపుల నిర్వహణకు అనుమతి

27 జిల్లాల్లో అన్ని షాపుల నిర్వహణకు అనుమతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ఆరు రెడ్‌ జోన్‌ జిల్లాల్లో తప్పితే మిగతా 27 జిల్లాల్లో అన్ని షాపుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. మండల కేంద్రం, గ్రామాల్లో అన్ని దుకాణాలను తెరుచుకోవచ్చన్న ప్రభుత్వం మున్సిపాలిటీల్లో 50 శాతం మాత్రమే దుకాణాల నిర్వహణకు అనుమతినిచ్చింది. దుకాణాలు ప్రక్కప్రక్కనే ఉండటం వల్ల ఈ 50 శాతం నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలిపింది. రోజు విడిచి రోజు దుకాణదారులకు తమ షాపులను తెరుచుకోవచ్చు. రెడ్‌ జోన్‌ జిల్లాల్లో మాత్రం దుకాణాలు తెరుచుకోవు. ఇక్కడ నిత్యావసర సరుకుల దుకాణాలు ఎప్పటి మాదిరిగానే తెరిచి ఉంటయంది. దీంతో పాటు గృహ నిర్మాణ పనులు, సిమెంట్‌, స్టీలు, ఎలక్ట్రిక్‌, హార్డ్‌వేర్‌ షాపులకు అనుమతి ఉంటుందంది. అదేవిధంగా వ్యవసాయ సంబంధ పనిముట్లు, వ్యవసాయ పనులు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. షాపులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు బుధవారం నుంచి పనిచేస్తాయంది. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ కూడా పనిచేస్తుందని.. రేపటి నుంచి భూముల అమ్మకాలు, కొనుగోలు చేసుకోవచ్చని సీఎం తెలిపారు. ఇసుక మైనింగ్‌ రేపటి నుంచే ప్రారంభం అవుతుందన్నారు. ఆర్టీఏ ఆఫీసులు కూడా పనిచేస్తాయన్నారు. కాగా రాష్ట్రంలోని రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లు అని తేడా లేకుండా అన్ని జిల్లాలో రాత్రి 7 గంటల నుంచి కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుందని సీఎం తెలిపారు. 


logo