గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 06:40:30

జూనియర్‌ కాలేజీల్లో ఆన్‌లైన్‌ తరగతులు!

జూనియర్‌ కాలేజీల్లో ఆన్‌లైన్‌ తరగతులు!

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కాలేజీల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సంఘం నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్లను ఈ విద్యాసంవత్సరానికి రెన్యువల్‌చేయాలని ఆ సంఘం నేత కొప్పిశెట్టి సురేశ్‌ కోరారు. కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలు చేపట్టాలని, తమను 58 సంవత్సరాల వరకు ఉద్యోగాల్లో కొనసాగించాలని మరో సంఘం నేతలు కనకచంద్రం, శేఖర్‌ ప్రభుత్వానికి విన్నవించారు.


logo