గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 14:06:29

చార్మినార్, గోల్కొండ సందర్శనకు అనుమతి నిరాకరణ

చార్మినార్, గోల్కొండ సందర్శనకు అనుమతి నిరాకరణ

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని చార్మినార్, గోల్కొండ సందర్శనను పురావస్తుశాఖ అధికారులు నిలిపివేశారు. కొద్ది రోజుల క్రితం పురావస్తు శాఖ జూలై 6 నుంచి ఈ రెండు చారిత్రక కట్టడాలను సందర్శించేందుకు అనుమతి ఇచ్చింది. ఆన్‌లైన్ ద్వారా టికెట్ల విక్రయం ప్రారంభించడంతో కొందరు కొనుగోలు కూడా చేశారు. కానీ ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కట్టడాలు కంటైన్మెంట్ జోన్‌లో ఉన్నాయి.  సోమవారం పోలీసులు చార్మినార్‌ను సందర్శించారు. చార్మినార్‌పైకి ఎక్కడానికి ఇరుకైన మెట్ల మార్గం ఉండటంతో భౌతిక దూరం పాటించడం కుదరదని తెలిపారు.

దీంతో పురవాస్తు శాఖ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించి సందర్శకుల అనుమతిని వాయిదా వేశారు. ఇక పోతే దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాల సందర్శనకు పురావస్తు శాఖ అనుమతి ఇచ్చింది. ఇక నగరంలోని రెండు కట్టడాలను ఈ నెల చివరి వారంలో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo