బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 13:03:09

పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం : మంత్రి అల్లోల

పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం : మంత్రి అల్లోల

నిర్మల్ : మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది నిముషాలు పారిశుధ్యం కార్యక్రమంలో భాగంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లోని తన నివాసంలో పిచ్చి మొక్కలు చెత్త  తొలగించారు. నిల్వ నీరు లేకుండా తొట్లలో నీళ్లు నిల్వ లేకుండా చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ఆరోగ్య తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.logo