బుధవారం 03 జూన్ 2020
Telangana - May 08, 2020 , 12:14:22

పేదవాడికి పిడికెడు బియ్యం

పేదవాడికి పిడికెడు బియ్యం

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అశ్వరావుపేట పట్నంలోని పేరాయిగూడెం గ్రామ సర్పంచ్‌ విన్నూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్‌ విజృంభనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాయి. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా ఉండేందుకు పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో దాతలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వ చర్యలకు తమ వంతు చేయూతను అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో పేరాయిగూడెం సర్పంచ్‌ నార్ల ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేషన్‌కార్డు దారుల నుంచి కిలో నుండి రెండు కిలోల చొప్పున బియ్యాన్ని సేకరించి రేషన్‌కార్డు లేని నిరుపేదలకు ఆ బియ్యాన్ని అందజేస్తున్నారు. సర్పంచ్‌ సామాజిక సేవకు స్థానిక యువకులు మద్దతుగా నిలుస్తున్నారు. 


logo