e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home తెలంగాణ ఆహార భద్రత హక్కును హరిస్తే సహించం : రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్

ఆహార భద్రత హక్కును హరిస్తే సహించం : రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్

భూదాన్‌పోచంపల్లి: రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల ఆహార భద్రత కోసం ఏర్పాటు చేసిన ఆహార భద్రత చట్టాన్ని దిక్కరించే హక్కు ఎవరికీ లేదని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ తిరుమల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని జలాల్‌పూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఆయన పోచంపల్లి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని, రేషన్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం, ఆహార లక్ష్మి పథకాల గురించి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్థిక, సామాజిక, పరిసరాల దృష్ట్యా ఆహారం అందరికీ సమానంగా అంద లేని పరిస్థితి ఉన్నదని ఆ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం రేషన్ దుఖానాల ద్వారా మధ్యాహ్న భోజనం, ఆహార లక్ష్మి పథకాల ద్వారా ప్రజలకు పౌష్టికాహారా న్ని అందిస్తున్నదన్నారు. ఈ ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నది లేనిది తెలుసకో వడానికి క్షేత్ర స్థాయిలో ఆహార కమిటీలను వేయడం జరగిందన్నారు. దీనిని మానిటరింగ్ చేయడంతోపాటు ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేయడానికి ఆహార భద్రత కమిషన్ పనిచేస్తున్నదన్నారు.

- Advertisement -

లబ్ధిదారుల హక్కును హరిస్తే వారు తగిన పరిహారం పొందే హక్కు కూడా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజనా నికి సంబంధించి రూ.27వేల పైచిలుకు పాఠశాలల్లో 22 లక్షల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నాని దీనికి సుమారు రూ. 300 కోట్ల వరకు నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. 37వేల పైచిలుకు అంగన్‌వాడీల్లో 28 లక్షల మం ది లబ్ధిదారులు, 3 సంవత్సరాల లోపు పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు రూ. 540 కోట్ల బడ్జెట్‌తో పోషకాహారం అం దిస్తున్నామని తెలిపారు.

ఆరోగ్య శాఖ రూ.400 కోట్లతో కేసీఆర్ కిట్, రూ.10 వేల కోట్ల బడ్జెట్‌తో 2కోట్ల 29 లక్షల మందికి 90 లక్షల రేషన్ కార్డుల ద్వారా పేదలకు రేషన్ సరఫరా చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు రూ. 18కోట్ల బడ్జెట్‌తో ఆహార భద్రత కల్పిస్తామని తెలిపారు. పేదలకు ఆహా ర భద్రత హక్కుకు బంగం కలిగితే ప్రతిఒక్కరూ చట్టం ద్వారా న్యాయం పొం దవచ్చునని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు డీఎంహెచ్‌వో సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో యశోద, డీపీఆర్వో ఉపెందర్‌రెడ్డి, డీఈవో చైతన్య జైనీ, తహసీల్దార్ గుగులోతు దశరథ నాయక్, ఎంపీడీవో బాలశంకర్, మండల వైద్యాధికారులు యాదగిరి, సత్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana