గురువారం 02 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 15:47:03

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

మేడ్చల్ మల్కాజిగిరి : మేడ్చల్ మున్సిపాలిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 2వ విడత పట్టణ ప్రగతి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మేడ్చల్ మండలంలోని మునీరాబాద్ గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా మొలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామన్నారు.

ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలన్నారు. ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమ సమయంలోనే సుందరీకరణ, ఇతర సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజా ప్రతినిధులు దగ్గరుండి పనులను పూర్తి చేయించాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది మంత్రి పేర్కొన్నారు.logo