బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 12:14:42

ప్రజల జీవితం రంగులమయం కావాలి: మంత్రి ఎర్రబెల్లి

ప్రజల జీవితం రంగులమయం కావాలి: మంత్రి ఎర్రబెల్లి

పాలకుర్తి: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు పాలకుర్తి వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు.. అక్కడ చిన్నారులతో కలిసి హోలీ పండుగ సెలబ్రేట్‌ చేసుకున్నారు. సీసీ రోడ్లకు శంకుస్థాపన చేస్తూ పట్టణ పర్యటనలో ఉన్న మంత్రిని.. స్థానిక చిన్నారులు రంగులు పూస్తామంటూ పలకరించారు. చిన్నారుల సరదాను కాదనలేని మంత్రి, తన హోదాను మరిచి చిన్నారులతో రంగులు పూయించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మంత్రి చిన్నారులకు, అక్కడి ప్రజానికానికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హోలీ రంగుల పండుగ అనీ, ప్రజల జీవితాలు కూడా రంగులమయం కావాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రజల జీవితాలు బంగారుమయం అవుతాయని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు. తాజా బడ్జెట్‌ కూడా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని మంత్రి ఎర్రబెల్లి ఈ సందర్భంగా తెలిపారు. 


logo