ఎలాంటి హైదరాబాద్ కావాలో ప్రజలే ఆలోచించాలి: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: ఎలాంటి హైదరాబాద్ కావాలో ప్రజలు ఆలోచించి ఓటువేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. బీజేపీ నేతలు బాబర్, బిన్‌లాడెన్ గురించి మాట్లాడుతున్నారని, అసలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు, బీజేపీ వాళ్ల మాటలకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. నిజాం క్లబ్లో జరిగిన ‘విశ్వనగరంగా హైదరాబాద్’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లో రోహింగ్యాలుంటే కేంద్రంలోని రక్షణ మంత్రి, హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రోహింగ్యాలకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో విపత్తు వస్తే స్పందించని ఢిల్లీ నేతలు.. జీహెచ్ఎంసీ ఎన్నికలనగానే టూరిస్టుల్లా ఇక్కడికి వచ్చి వెళ్తున్నారని విమర్శించారు. మొహం చూపించి వెళ్లేవారు కావాలో? నిత్యం ప్రజల మధ్య ఉండేవాళ్లు కావాలో? ప్రజలు ఆలోచించాలని కోరారు.
తెంగాణకు కేంద్రం చేసిందేమిటి?
ఇప్పటివరకు మేము చేసిన అభివృద్ధిని చెప్పి ఓట్లు అడుగుతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.67 వేల కోట్లతో హైదరాబాద్‌లో అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రివర్గంలో తెంగాణ నుంచి ప్రాతినథ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు ఒక్క రూపాయి అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. కేంద్రానికి తెలంగాణ రూ.2.72 లక్షల కోట్లు పన్నులు చెల్లిస్తే.. కేంద్రం రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చిందన్నారు. ఆరేండ్లలో తెలంగాణలో ప్రజలకు ఏం చేశామో ప్రగతి నివేదిక కూడా విడుదల చేశాం. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో కిషన్ రెడ్డి చూపించాలన్నారు. కేంద్రం తెలంగాణకు మెహర్బాని చేస్తున్నట్లు బీజేపీ నేతలు ఫోజు కొడుతున్నారని విమర్శించారు.
రూ.15 లక్షలు ఎంతమందికిచ్చారు..
ప్రధాని మోదీ జన్‌ధన్ ఖాతాలు తెరవండి.. ధన్.. ధన్గా రూ.15 లక్షలు ఇస్తామన్నారు. ఎవరికిచ్చారని ఎద్దేవా చేశారు. కరోనా సందర్భంగా రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. కనీసం 20 మందికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. కరోనా ప్రారంభం నుంచి వరుసగా 8 త్రైమాసికాలు జీడీపీ క్షీణించిందన్నారు. దేశంలో 2 కోట్ల యువతకు ఉద్యోగాలిస్తామన్నారు.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. బీజేపీకి తెలిసింది హిందూ, ముస్లిం అంటూ మత విద్వేషాలు రెట్టగొట్టడమే? అని, మత ప్రాతిపదికన విభేదాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. నష్టాల్లో ఉందని ఎయిరిండియాని అమ్మేస్తున్నారు, మరి లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు.
తాజావార్తలు
- అమెజాన్ ‘బ్లూ ఆరిజన్’ సక్సెస్
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
- టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
- ‘శశి’ వచ్చేది ప్రేమికుల రోజుకే..
- టీకా సంరంబం.. కరోనా అంతం !
- పేదలకు ఉచితంగా టీకాలు ఇవ్వాలి: పంజాబ్ సీఎం