ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 17:49:37

చేపల కోసం ఎగబడ్డ జనం.. సుందిళ్ల‌ ప్రాజెక్టు వద్దకు పరుగులు

చేపల కోసం ఎగబడ్డ జనం.. సుందిళ్ల‌ ప్రాజెక్టు వద్దకు పరుగులు

మంచిర్యాల జిల్లా జైపూర్ మండ‌లంలోని  కిష్టాపూర్‌, కుందారంలో చేప‌ల కోసం గ్రామ ప్ర‌జ‌లు తండోప‌తండాలుగా ప‌రుగులు పెట్టారు. గ‌త‌కొన్ని రోజులుగా వ‌ర్షాలు ప‌డుతుండ‌డంతో సుందిళ్ల‌ ప్రాజెక్టు గేట్ల‌ను ఎత్తివేశారు. ఇప్పుడు వ‌ర్షాలు కాస్త సద్దుమణ‌గ‌డంతో సుందిళ్ళ బ్యారేజ్ గేట్ల‌ను అధికారులు మూసివేశారు.

దీంతో అక్క‌డ చేప‌ల వ‌ర‌ద మొద‌లైంది. ఒక‌టి కాదు రెండు కాదు బ‌స్తాల కొద్ది చేప‌లు ప్ర‌త్య‌క్ష్యమ‌వ‌డంతో స్థానికులు ముందుగానే బైకులు, ఆటోల‌లో వ‌చ్చి చేప‌ల‌ను ఇంటికి త‌ర‌లించారు. logo