మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 14:27:20

ఆస్తుల నమోదుకు ప్రజలు సహకరించాలి : మంత్రి పువ్వాడ

ఆస్తుల నమోదుకు ప్రజలు సహకరించాలి : మంత్రి పువ్వాడ

ఖమ్మం : పేద ప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ప్రజల ఆస్తుల ఖచ్చితమైన వివరాలు నమోదుకు నగర ప్రజలు సహకరించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. గురువారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 7, 8, 35వ డివిజన్లలో మంత్రి పర్యటించి ఆయా ప్రజలతో మాట్లాడారు.తమ తమ డివిజన్ లలో పేదలు ప్రభుత్వ స్థలంలో ఇళ్ళు నిర్మించుకున్న వారు ధరణి ఆప్ లో తప్పక నమోదు చేసుకోవాలన్నారు.

ఎవరికైనా ఇంటి నెంబర్ లేకపోతే ఇచ్చి మరీ నమోదు చేస్తామన్నారు. ఎవరు ఎక్కడ కాగితాలు ఇవ్వాల్సిన పని లేదని, మీరు వివరాలు చెప్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఆయా ఇంటి యజమానులతో మాట్లాడి పలు సందేహాలను నివృతి చేశారు. దసరా నుంచి దీపావళి మధ్యలో తానే స్వయంగా వచ్చి అందిస్తానని చెప్పారు.  అనంతరం సీఎంఆర్‌ఆఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు వీడీవోస్ కాలనీ క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.logo