e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఐజీ రంగనాధ్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఐజీ రంగనాధ్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఐజీ రంగనాధ్

నల్లగొండ : జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కరెంటు ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను ముట్టుకోకుండా చిన్నపిల్లలను దూరంగా ఉంచాలని డీఐజీ ఏవీరంగనాధ్ సూచించారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లు గాని, రహదారులు గాని, పొలాలకి వెళ్ళే బాటాలుగాని భారీ వర్షాల కారణంగా కొట్టుకోపోయే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో ఎక్కడైనా రోడ్లు, వంతెనలు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇస్తే స్థానిక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. చెరువులు, కుంటలు, వాగులు నీటితో నిండి ఉప్పొంగుతుంటా యని, వాగులు ప్రమాద స్థాయిలో పరుగులు పెడుతున్న సమయం లో ఎట్టి పరిస్థితుల్లో వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు సూచించారు.

- Advertisement -

గ్రామీణ ప్రాంతాలలో పాడుబడిన బావులు, చుట్టూ కంచె లేని బావుల దగ్గర జాగ్రతగా ఉండాలన్నారు. వాహనదారులు నెమ్మదిగా తమ గమ్యాలను చేరుకోవాలని, ప్రజల సంక్షేమంలో కూడా పోలీస్ అధికారులు ఎల్లపుడూ ముందుంటారని రంగనాధ్ తెలిపారు. ప్రజలంతా పోలీసులతో సహకరిస్తూ ఎలాంటి విపత్కర పరిస్థితులున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

ఇవి కూడా చదవండి..

నిర్మల్‌ వర్ష ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా

ఆరు దశాబ్దాల సమస్యకు ఆరు నెలల్లోనే పరిష్కారం

దారుణం : భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

ఇసుక ట్రాక్టర్‌ ఢీ కొని వ్యక్తి మృతి

పార్ల‌మెంట్‌ ముందు ఆందోళ‌న‌కు భారీగా త‌ర‌లివ‌చ్చిన రైతులు..!

గ్రామాల అభివృద్ధి బాధ్యత మీదే : మంత్రి హరీశ్‌రావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఐజీ రంగనాధ్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఐజీ రంగనాధ్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఐజీ రంగనాధ్

ట్రెండింగ్‌

Advertisement