శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 17:42:20

వ్యాక్సి నేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి

వ్యాక్సి నేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి

సిద్దిపేట : త్వరలోనే  కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్‌  వెంకట్రామ్‌ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ మీటింగ్ హాల్‌లో కొవిడ్‌ వాక్సినేషన్‌ ప్రోగ్రామ్ ఇంటర్‌ డిపార్ట్‌మెంటల్‌ కోఆర్డినేషన్‌ను ఉద్దేశించిన జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..త్వరలో వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉన్నందున ఆ మేరకు వ్యాక్సిన్‌ స్టోరేజీ, పంపిణీ ప్రక్రియకు కార్యాచరణ ముందే సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.

తొలి దశలో కొవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పని చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి హెల్త్ కేర్ వర్కర్స్ 7,495 మందికి, రెండో దశలో పోలీస్ శాఖ సిబ్బంది, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బందికి , మూడో దశలో 50 సంవత్సరాలు పై బడిన వ్యక్తులు, బీపీ, షుగర్, క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు.


కావున ఆ మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. వాక్సినేషన్ పంపిణీ ప్రక్రియకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంపొందించేందుకు, పంపిణీ సజావుగా జరిగేలా చూసేందుకు వీలుగా డివిజన్, మండల , గ్రామ స్థాయిలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు


logo