ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 18:19:42

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి ఎర్రబెల్లి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి ఎర్రబెల్లి

‌రంగ‌ల్ : తుఫాన్ హెచ్చరికల నేప‌థ్యంలో అధికారుల‌తోపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు. ఈ ఏడాది విస్తృతంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయ‌ని, అందులో తుఫాన్లు కూడా వ‌స్తున్నాయ‌న్నారు. ఈ తుఫాన్ల కార‌ణంగా గ‌తంలోని అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని, అటు అధికారులు, ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌న్నారు. 

లోత‌ట్టు ప్రాంతాల ప్రజలు వ‌ర్ష సూచ‌న‌ల‌ను బ‌ట్టి సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌న్నారు. పిడుగుల ప‌డే ప్రమాదం ఉన్నందున వ్యవసాయ‌దారులు, చేప‌లు ప‌ట్టే వారు కూడా వాతావ‌ర‌ణాన్ని బ‌ట్టి బ‌య‌ట‌కు వెళ్లాల‌న్నారు. ఈ అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులు త‌గు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


logo