శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 23, 2020 , 19:42:45

ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ప్రజలు భాగస్వాములు కావాలి

ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ప్రజలు భాగస్వాములు కావాలి

ఖమ్మం : ఖమ్మం నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.  ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఆర్టీవో కార్యాలయం (బైపాస్ రోడ్), తెలంగాణ తల్లి సర్కిల్ (బైపాస్ రోడ్డు), ఐటీ హబ్ సర్కిల్ (ఇల్లందు క్రాస్ రోడ్ సర్కిల్), మమత హాస్పిటల్ x రోడ్ నందు ఏర్పాటు చేసిన సిగ్నల్స్ ను ప్రారంభించారు. రూ.60 లక్షలతో నాలుగు సిగ్నల్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే నగరంలో రూ. 50 లక్షల వ్యయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 

పటిష్ట భద్రత కోసం అన్ని కూడళ్లలో సీసీ కెమెరాల ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందన్నారు. రోడ్డుపైకి వచ్చే ప్రతి పౌరుడు పోలీస్ నిఘాలో ఉంటారని, తద్వారా ప్రమాదాలు, నేరాలు అదుపులోఉంటాయని తెలిపారు. రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. నగర ప్రజలందరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. 


కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ , సుడా చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, పోలీస్ కమిషనర్ తఫ్సిర్ ఇక్బాల్, ఏసీపీలు రామోజీ రమేష్, వెంకట్ రెడ్డి, సీఐలు గోపి, శ్రీధర్, కరుణాకర్, చిట్టిబాబు, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇంచార్జి ఆర్జేసీ కృష్ణ , కార్పొరేటర్లు చావా నారాయణ రావు, కమర్తపు మురళి, పగడాల నాగరాజు, మున్సిపల్ డీఈ రంగారావు, సిబ్బంది తదితరులు ఉన్నారు.


logo