సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 01:32:03

ప్రజలు మా వైపే

ప్రజలు మా వైపే

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వినూత్న విధానాలతో రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. అన్నివర్గాల కోసం ఎంతో చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైపే ప్రజలు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీఎం సభ సందేశాత్మకంగా ఉన్నది. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ నగరంలో డివిజన్లవారీగా చేపట్టిన రోడ్‌షోల ద్వారా ప్రభుత్వ విధానాలపై ఎంతో అవగాహన కల్పించారు. రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రసంగాల ద్వారా ప్రజలకు వివరంగా చెప్పారు. రోడ్‌షోలు అన్నివర్గాలవారిని ఆకర్షించాయి. సీఎం కేసీఆర్‌పై ప్రజలు నమ్మకంతో ఉన్నారు. వారంతా ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు. నగరంలో ప్రశాంతతను కాపాడుకోవాలని భావిస్తున్నారు. ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా.. అంతిమ విజయం టీఆర్‌ఎస్‌దే.

- ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

దేవుడే నగరాన్ని రక్షిస్తాడు 

అభివృద్ధికి కేరాఫ్‌గా ఉన్న హైదరాబాద్‌ నగరాన్ని చెడు దృష్టితో చూసేవాళ్ల నుంచి దేవుడు రక్షిస్తాడు. ఇక్కడ మత సామరస్యం, శాంతియుత వాతావరణం ఉన్నది. హైదరాబాద్‌ మొదటి నుంచి గ్లోబల్‌ సిటీ. ఇది డైమండ్‌ లాంటిది. వాణిజ్యరంగానికి కేంద్ర బిందువు. ఫార్మాహబ్‌, పరిశోధనలు, పలు నూతన ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రమైన హైదరాబాద్‌ లవ్‌ షహర్‌.  

-ట్విట్టర్‌లో సయ్యద్‌ అక్బర్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ ట్వీట్‌

గుర్తింపును దోచుకునేవారిని అనుమతించొద్దు

ప్రియమైన హైదరాబాదీ. మన నగరానికి సంబంధించి ఎంతో అద్భుతమైన చరిత్ర, సంస్కృతి, గుర్తింపును దోచుకునేందుకు ఎవరినీ అనుమతించొద్దు. మేం హైదరాబాదీలం అంటూ మనమంతా గర్వంగా చెప్పుకొందాం. పేర్లను మార్చడం అవసరంలేదు. ఈ సమయంలో ఉత్పాదకతను ఉన్నతి వైపునకు తీసుకువెళ్లడం అవసరం. నగరాల పేరు మార్చడం వల్ల  తియ్యదనం పెరుగుతుందా?. 

-ట్విట్టర్‌లో సునీత సిమన్‌, కమ్యూనికేషన్‌ ప్రొఫెషనల్‌