శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 10:57:56

మార్చి తర్వాత 57 ఏళ్ల వయసువారికి పెన్షన్లు : మంత్రి ఎర్రబెల్లి

మార్చి తర్వాత 57 ఏళ్ల వయసువారికి పెన్షన్లు : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద : మార్చి నెల తర్వాత రాష్ట్రంలో 57 ఏళ్ల వయసువారందరికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా ఆసరా పింఛన్లపై సభ్యులు ధర్మారెడ్డి, చందర్‌, వీరయ్య, జాఫర్‌ హుస్సేన్‌, రాజాసింగ్‌, భాస్కర్‌రావు, రామలింగారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. రాష్ట్రంలో కళ్లుగీత కార్మికులు, వృద్ధులకు, వికలాంగులకు, హెచ్‌ఐవీ, వితంతువులకు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులు, బోధకాల వ్యాధిగ్రస్తులకు ఈ పథకం వర్తించేట్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

రాష్ట్రంలో మొత్తం పింఛన్‌దారులు 38 లక్షల 77 వేల 717 మంది ఉన్నారు. పింఛన్ల రూపంలో వీరికి ప్రతి నెల రూ. 879 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. వృద్ధాప్య పింఛన్ల వయస్సు 65 నుంచి 57 ఏళ్లు చేస్తే అదనంగా మరో 6 లక్షల 62 వేల మంది లబ్దిదారులు అవుతారన్నారు. కొత్తగా ఇచ్చేవారిని కలుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది రూ. 11 వేల 758 కోట్లు అవుతుందన్నారు. కాగా కేంద్రం ఇచ్చేది కేవలం రూ. 203 కోట్లు మాత్రమేనన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్లందరికీ కూడా పింఛన్లు ఇస్తున్న మహాత్ముడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు.


logo