బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 18:35:48

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే  అన్నంరెడ్డి అదీప్‌

విశాఖపట్నం: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం  ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ మొక్కలు నాటారు. రాంపూర్ గ్రామం , సబ్బవరం మండలంలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని మొక్కలు నాటాలని నామినేట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకి ఎంతో చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కృషిని ప్రత్యేకంగా అభినందించారు. పర్యావరణం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత ,30 ,40 సంవత్సరాల తర్వాత ఏర్పడే పర్యావరణ పర్యవసనాలు దృష్టిలో పెట్టుకొని ,రానున్న కాలంలో వాతావరణం లో వచ్చే హెచ్చు తగ్గుదలను సమతుల్యత కావాలి అంటే   మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు.   మనందరం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమానికి  మద్దతివ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. 


logo