మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 01:32:17

గంజాయి అమ్మితే పీడీయాక్ట్‌

గంజాయి అమ్మితే పీడీయాక్ట్‌

  • ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గంజాయి అమ్మితే పీడీయాక్ట్‌ నమోదుచేయాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గుడుంబా నియంత్రణకు అనుసరించిన కఠిన వైఖరినే గంజాయి విక్రయాలపైనా పాటించాలని స్పష్టంచేశారు. ఆదివారం మంత్రి తన నివాసంలో గోషామహల్‌ నియోజకవర్గంలో గుడుంబా బాధితులకు పునరావాస కల్పనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాసింగ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కఠినంగా వ్యవహరించడం వల్లనే గుడుంబా నిర్మూలన సాధ్యమైందన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ధూల్‌పేటలో ప్రభుత్వ భూమి ఉంటే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, స్వయం ఉపాధి కల్పన కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించేందుకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌తో ఎక్సైజ్‌ అధికారులు సమావేశం కావాలని మంత్రి సూచించారు. సమావేశంలో టీఎస్‌బీసీఎల్‌ ఓఎస్డీ సంతోష్‌రెడ్డి, హైదరాబాద్‌  జిల్లా ఈఎస్‌ శీలం శ్రీనివాసరావు, ఏఈఎస్‌ నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.