శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 10:53:55

నాటిన ప్ర‌తి మొక్క సంర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు : జ‌డ్పీ ఛైర్మ‌న్ పుట్ట మ‌ధుక‌ర్

నాటిన ప్ర‌తి మొక్క సంర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు : జ‌డ్పీ ఛైర్మ‌న్ పుట్ట మ‌ధుక‌ర్

పెద్ద‌ప‌ల్లి : హరితహారం కార్యక్రమం లో భాగంగా నాటిన  ప్రతి మొక్క సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధుకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యంత  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ కోసం చేపట్టాల్సిన పనులపై మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండ శంకర్ లతో కలిసి  సోమవారం ఉదయం స్థానిక ఆర్టీసీ డిపో నుంచి మంథని-గోదావరిఖని ప్రధాన రహదారి వెంట పోచమ్మ వాడ కొత్త రోడ్డు పాత రోడ్డు వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర పుట్ట మ‌ధుక‌ర్ నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరు సంరక్షించి చెట్లుగా మార్చి భవిష్యత్ తరాలకు అందజేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటడం తో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తగరం శంకర్ లాల్, ఎక్కేటి అనంత రెడ్డి, ఆరెపల్లి కుమార్, బత్తుల సత్యనారాయణ, కుంట శ్రీనివాస్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.logo