బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 17:36:36

పెద్దపల్లి ఎమ్మెల్యే పెద్ద మనసు.. అంబులెన్సుల కొనుగోలుకు ఆర్థిక సాయం

పెద్దపల్లి ఎమ్మెల్యే పెద్ద మనసు.. అంబులెన్సుల కొనుగోలుకు ఆర్థిక సాయం

పెద్దపల్లి : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మానవతా హృదయంతో ముందుకొచ్చారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే అంబులెన్సుల కోనుగోలుకు ఆర్థిక సాయం అందజేసి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారి పంజా విసురుతున్న వేల నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలున్న, అత్యవసర పరిస్థితుల్లో తరలించేందుకు రెండు అంబులెన్సులను సమకూర్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

ఈ మేరకు సోమవారం ఐటీ, మున్సిపల్ శాఖ కేటీఆర్ తో భేటీ అయ్యారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా పేదలకు సాయపడాలన్న కేటీఆర్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని సొంత డబ్బులతో అంబులెన్సులు సమకూర్చేందుకు ముందుకొచ్చారు. పెద్దపల్లి తో పాటు సుల్తానాబాద్ లో సేవలందించేందుకు రెండు అంబులెన్స్లను  సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు.  

ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్ కు అందించారు. అంబులెన్స్ లు అందించేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు.  ప్రజాప్రతినిధులందరూ మనోహర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
logo