మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 19, 2021 , 20:38:08

వేరుశనగ క్వింటాల్‌ @ రూ.7,712

వేరుశనగ క్వింటాల్‌ @ రూ.7,712

జోగుళాంబ గద్వాల :  జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ పంట పండించిన రైతుకు మద్దతు ధర లభించింది. ఈ ఏడాది ఇదే అత్యధిక ధర కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కాలూరు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు మంగళవారం తాను పండించిన వేరుశనగను గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు విక్రయానికి తీసుకొచ్చాడు. వేరుశనగ కాయ నాణ్యతగా ఉండటంతో ట్రేడరు అత్యధిక ధర చెల్లించారు. క్వింటాలుకు రూ.7,712 ధర లభించింది.

మార్కెట్‌కు 1,059 క్వింటాళ్ల వేరుశనగ రాగ క్వింటాలుకు గరిష్ఠంగా రూ.7,712 ధర రాగా.. కనిష్ఠంగా రూ.3,300 వచ్చింది. ఆముదాలు 18 క్వింటాళ్లు రాగా అత్యధికంగా రూ.4,130 ధర రాగా.. అత్యల్పంగా రూ.3,857 ధర వచ్చింది. వరి 17 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ.1,782 పలకగా.. కనిష్ఠంగా రూ.1,551 ధర పలికింది. కందులు 230 క్వింటాళ్లు రాగా అత్యధికంగా రూ.5,826 ధర రాగా.. అత్యల్పంగా రూ.4,559 లభించింది. మార్కెట్‌లో పంటలకు మద్దతు ధరలు లభిస్తుండటంతో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ హర్షం వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండి..

బంగారు కమ్మలు కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య

శభాష్‌ టీమిండియా : మంత్రి హరీశ్‌ రావు 

ఎములాడలో దంతెవాడ ఎమ్మెల్యే పూజలు

సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు : మంత్రి జగదీశ్ రెడ్డి 

అత్య‌ద్భుత సిరీస్ విజ‌యాల్లో ఇదీ ఒక‌టి: స‌చిన్‌ 

టీమిండియాకు 5 కోట్ల బోన‌స్

టీమిండియా విజ‌యంపై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు

రిష‌బ్ పంత్ సూప‌ర్ షో.. క్లాసిక్‌ ఇన్నింగ్స్‌ 

VIDEOS

logo