గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 14:42:00

పెంపుడు కోళ్ల‌తో వచ్చిన నెమలి.. అట‌వీ అధికారుల‌కు అప్ప‌గింత‌

పెంపుడు కోళ్ల‌తో వచ్చిన నెమలి.. అట‌వీ అధికారుల‌కు అప్ప‌గింత‌

ఖమ్మం : మ‌ఏత మేత మేయ‌డానికి వెళ్లిన పెంపుడు కోళ్ల‌తో పాటు ఓ నెమ‌లి ఇంటికి వ‌చ్చింది. నెమ‌లిని గుర్తించిన ఇంటి య‌జ‌మాని అట‌వీ అధికారుల‌కు స‌మాచారం అందించ‌డంతో అధికారులు వ‌చ్చి నెమ‌లిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం చిన్నబీరవల్లి గ్రామంలో మంగ‌ళ‌వారం సాయంత్రం చోటుచేసుకుంది. 

మధిర ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్  మాట్లాడుతూ.. అడవి జంతువులు తప్పిపోయి గ్రామాల్లోకి వస్తే స్థానికులు సమాచారం ఇవ్వాలన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సీతారాములు, బీట్ ఆఫీసర్ కవిత, సురేష్ నెమలిని జిల్లా పరిధిలోని ఎర్రుపాలెం  మండలం రేమిడిచర్ల అట‌వీప్రాంతంలో విడిచిపెట్టారు. 


logo