ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 18:14:13

పీడీఎస్‌ బియ్యం లారీ పల్టీ.. బియ్యం బస్తాల కోసం ఎగబడ్డ జనం

పీడీఎస్‌ బియ్యం లారీ పల్టీ.. బియ్యం బస్తాల కోసం ఎగబడ్డ జనం

నల్లగొండ : అక్రమంగా పీడీఎస్‌ బియ్యం తరలిస్తున్న లారీ(ఏపీ 39టీ 7788) అదుపుతప్పి బోల్తాపడింది. నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. లారీలోని బియ్యం బస్తాలు కిందపడటంతో అక్రమార్కులు బియ్యాన్ని అక్కడే వదిలేశారు. లారీని మాత్రం గుట్టుచప్పుడు రెండు జేసీబీల సాయంతో తీసుకెళ్లారు.

ఉదయం రోడ్డు వెంట పొలంలో పడిన బియ్యం బస్తాలకోసం స్థానికులు ఎగబడ్డారు. బైకులు, సైకిళ్లు, ట్రాక్టర్లపై వచ్చి బస్తాలను ఎత్తుకెళ్లారు. లారీలో సుమారుగా 250 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం ఉండొచ్చని సమాచారం. నియోజకవర్గంలో రేషన్‌ బియ్యం దందా ఏ స్థాయిలో జరుగుతుందో ఈ ఘటన కళ్లకు కడుతోంది. రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా పోలీసులు, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo