సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 01:08:34

బియ్యం వ్యాపారిపై పీడీయాక్టు

బియ్యం వ్యాపారిపై పీడీయాక్టు

హన్మకొండ సిటీ, జనవరి 1: రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యాపారిపై శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లిలో పీడీ యాక్టు నమోదైంది. వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం శంభునిపల్లికి చెందిన స్వణాకర్‌ అలియాస్‌ రమేశ్‌ కరీంనగర్‌, సిద్దిపేట జిల్లాల్లో  రేషన్‌ బియ్యం దందా చేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్‌ 14న 250 క్వింటాళ్ల బియ్యాన్ని లారీలో రఘునాథపల్లికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇదే తరహాలో దుగ్గొండి, ఆత్మకూర్‌, మామునూర్‌, ములుగు, హుజూరాబాద్‌, చిగురుమామిడి, సుల్తానాబాద్‌, జనగామలోను కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. వరంగల్‌ సీపీ ప్రమోద్‌కుమార్‌ ఆదేశాలతో వరంగల్‌లోని ఏకశిలానగర్‌లో ఉంటున్న నిందితుడికి జనగామ రూరల్‌ సీఐ బాలాజీవరప్రసాద్‌ ఉత్తర్వులు అందజేసి సెంట్రల్‌ జైలుకు తరలించారు.