మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 19:27:13

ఎల్లం గౌడ్‌ హత్య కేసు నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు

ఎల్లం గౌడ్‌ హత్య కేసు నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు

సిద్దిపేట : ఎల్లం గౌడ్‌ హత్య కేసులో ప్రధాన నిందితులైన ఇద్దరిపై పీడీ యాక్ట్‌  కింద చర్యలు చేపడుతూ పోలీస్‌ కమిషనర్‌ డి.జోయల్‌ డేవిస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట మండలం తడ్కపల్లి గ్రామానికి చెందిన నిందితుడు తొండేంగల వెంకట్‌(30) అదేవిధంగా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామానికి చెందిన నిందితుడు ఎడ్ల మధుసూదన్‌ రెడ్డి(42)పై పీడీ యాక్ట్‌ నమోదైంది. వీరిరువురు గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో దొంగతనాలు, అక్రమ భూదందాలు చేసిన కేసుల్లో జైలు శిక్ష అనుభవించారు. గత నేర చరిత్ర, ప్రస్తుత ప్రవర్తనను అధ్యయనం చేసి నిందితులపై పీడీ యాక్ట్‌ అమలు చేయడం జరుగుతుందని కమిషనర్‌ తెలిపారు.

పోలీస్‌ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను మంగళవారం సిద్దిపేట రూరల్‌ సీఐ సురేందర్‌ రెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారంలో నిందితులకు జైలర్‌ సమక్షంలో అందజేశారు. రౌడీ షీటర్‌ ఎల్లం గౌడ్‌ హత్య ఘటన సిద్దిపేట జిల్లాలో ఇటీవల సంచలనం సృష్టించింది. స్కూటీపై ఒంటరిగా వస్తున్న ఎల్లంగౌడ్‌పై ప్రత్యర్థులు కంట్లో కారం చల్లి కొబ్బరికాయలు కొట్టే కత్తులతో మెడపై, చేతులు, కాళ్లపై దారుణంగా నరికి హత్యచేశారు.


logo