శనివారం 06 మార్చి 2021
Telangana - Jan 26, 2021 , 12:53:54

అటవీశాఖ ఉద్యోగులకు ప్రశాంసా పత్రాలు అందజేసిన పీసీసీఎఫ్‌

అటవీశాఖ ఉద్యోగులకు ప్రశాంసా పత్రాలు అందజేసిన పీసీసీఎఫ్‌

హైదరాబాద్ :  నిబద్ధతతో విధులు నిర్వహించిన ఉద్యోగులు, సిబ్బందిని అటవీశాఖ ప్రోత్సహిస్తున్నదని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ శోభ పేర్కొన్నారు. గణతంత్ర దినం సందర్భంగా అరణ్య భవన్‌లో సిబ్బందితో కలిసి ఆమె జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కరోనా సమయంలోనూ అటవీశాఖ సిబ్బంది బాగా పనిచేశారని అభినందించారు.

వివిధ సెక్షన్లలో విధుల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లాకు ఆరుగురు ఉద్యోగుల చొప్పున నగదు, ప్రశాంసా పత్రాలు అందించినట్లు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) శోభ వెల్లడించారు. కార్యక్రమంలో  అటవీశాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo