శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 00:44:04

పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకే ఇవ్వాలి

పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకే ఇవ్వాలి

  • మూడు శాతమున్న కులస్థులతో కాంగ్రెస్‌కు దెబ్బ
  • వంగవీటి రంగా విగ్రహావిష్కరణలో వీహెచ్‌

చింతలపాలెం: తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని 54 శాతం ఉన్న బీసీలకే కేటాయించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావు కోరారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడులో ఏర్పాటు చేసిన దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బీసీ వర్గానికి చెందిన రంగా రానున్న రోజుల్లో సీఎం అవుతాడని హత్య చేశారన్నారు. వంగవీటి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. బీసీలకు పీసీసీ పదవి ఇవ్వాలని కోరితే తనకు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని, తాను ఎవరికీ భయపడేది లేదని చెప్పారు. పార్టీ కోసం ప్రాణం పోయినా పర్వాలేదన్నారు. రాష్ట్రంలో మూడు శాతమున్న కులస్థులు కాంగ్రెస్‌ పార్టీని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో 27శాతం ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలన్నారు. బీజేపీ మతతత్వపార్టీ అని, దానికి సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ మద్దతివ్వడం సరికాదని పేర్కొన్నారు. ఆయన కాంగ్రెస్‌లోకి వస్తే సోనియా, రాహుల్‌గాంధీతో మాట్లాడి అధ్యక్ష పదవి ఇప్పిస్తానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు వినయ్‌కుమార్‌, ఉగ్గె శ్రీనివాస్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.  logo