సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 01:47:06

జూన్‌ నెల పూర్తి వేతనం ఇవ్వండి

జూన్‌ నెల పూర్తి వేతనం ఇవ్వండి

  • ప్రభుత్వానికి టీఎన్జీవో విజ్ఞప్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/సుల్తాన్‌బజార్‌: ఉద్యోగులకు జూన్‌ నెల పూర్తివేతనం, గత మూడునెలలు రిజర్వుచేసిన వేతనాలను చెల్లించాలని ప్రభుత్వానికి టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్‌లో రాష్ట్ర వసతిగృహ సంక్షేమ అధికారుల ఫోరం కార్యవర్గ సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎండీ ఖాజాగౌస్‌, కార్యదర్శిగా బీ మాధవ్‌గౌడ్‌, సహ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌, కోశాధికారిగా పీ సుదర్శన్‌ ఎన్నికయ్యారు. కార్యవర్గాన్ని కారం రవీందర్‌రెడ్డి అభినందించారు. సమావేశంలో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్‌, ఇతర నాయకులు ఆర్‌ ప్రతాప్‌, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo