శనివారం 06 జూన్ 2020
Telangana - May 23, 2020 , 23:51:12

రేషన్‌ తీసుకోనివారికీ రూ.1500 నగదు

రేషన్‌ తీసుకోనివారికీ రూ.1500 నగదు

  • పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రేషన్‌కార్డుపై బియ్యం తీసుకోని లబ్ధిదారులకు కూడా రూ.1500 చొప్పున నగదు ప్రయోజనాన్ని వర్తింపజేసినట్టు పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి శనివారం చెప్పారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రభుత్వం పేదలకు ఉచిత బియ్యంతోపాటు రూ.1500 చొప్పున అందజేసిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు నెలలపాటు బియ్యం తీసుకోని లబ్ధిదారులకు నెలకు రూ.1500 నగదు చొప్పున జమచేసినట్టు మారెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ నెలలో 74.07 లక్షలు, మే నెలలో 74.35 లక్షల మంది లబ్ధిదారులకు కలిపి మొత్తంగా రూ.2,227 కోట్లు జమచేసినట్లు తెలిపారు. బ్యాంకు ఖాతాలు లేనివారికి మరో రూ.158.24 కోట్లు అందజేసినట్టు పేర్కొన్నారు. శనివారంనాటికి ఉచితంగా 81.49 లక్షల (93.10 శాతం) మంది కార్డుదారులకు 3 లక్షల 25వేల టన్నుల బి య్యాన్ని, 5,187 టన్నుల కందిపప్పును అందజేశామని చెప్పారు.


logo