గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 07:38:50

‘31లోగా ఆస్తిపన్ను బకాయిలను చెల్లించాలి’

‘31లోగా ఆస్తిపన్ను బకాయిలను చెల్లించాలి’

హైదరాబాద్ : గత ఆర్థ్ధిక సంవత్సరం(2019-20)గాను సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్‌ బకాయిలను ఈ నెల 31వ తేదీలోగా చెల్లించాలని  పన్ను చెల్లింపుదారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంవత్సరంలో నిర్దేశించిన  ప్రాపర్టీ ట్యాక్స్‌ లక్ష్యం రూ.1800 కోట్లు కాగా, నేటి  వరకు రూ.1291.49 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.  ఇంకా రూ.508.51 కోట్లు ప్రాపర్టీ బకాయిలు రావాల్సి ఉందన్నారు. ప్రాపర్టీ ట్యాక్సీను వసూలు చేసేందుకు  ట్యాక్స్‌ కలెక్టర్లు ఇంటింటికి తిరిగుతున్నట్లు తెలిపారు. అలాగే మీ సేవా, సిటీజన్‌ సర్వీస్‌ సెంటర్‌, ఆన్‌లైన్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ద్వారా కూడా ప్రాపర్టీ ట్యాక్స్‌ బకాయిలను చెల్లించవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌ చెల్లింపుదారుల చార్జీలను జీహెచ్‌ఎంసీ భరిస్తుందన్నారు.  


logo