గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 01:56:53

గతేడాది ఫీజులను చెల్లించండి: ట్రస్మా

గతేడాది ఫీజులను చెల్లించండి: ట్రస్మా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామని, గతేడాదికి చెందిన ట్యూషన్‌ ఫీజులను చెల్లించాలని తల్లిదండ్రులను ట్రస్మా నేతలు యాదగిరి శేఖర్‌రావు, మధుసూదన్‌ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఫీజులు చెల్లించడం వల్ల ప్రైవేటు విద్యాసంస్థలను ఆదుకున్నట్లవుతుందని పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఆన్‌లైన్‌ బోధనకు అందరూ సహకరించాలని విజ్ఞప్తిచేశారు.


logo