శుక్రవారం 29 మే 2020
Telangana - Mar 31, 2020 , 06:39:18

స్మార్ట్ ఫోన్ తో ఇంటి నుంచే విద్యుత్‌ బిల్లులు..

స్మార్ట్ ఫోన్ తో ఇంటి నుంచే విద్యుత్‌ బిల్లులు..

పెద్దపల్లి ‌: ఇంటి వద్ద నుంచి స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా విద్యుత్‌ బిల్లులు చెల్లించవచ్చనని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ పెద్దపల్లి ఎస్‌ఈ గంగాధర్‌ తెలిపారు. బిల్లులను సకాలంలో చెల్లిస్తేనే అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేసే అవకాశం ఉందని, వినియోగదారులు మొబైల్‌ నుంచి టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ వెబ్‌సైట్‌/ మొబైల్‌యాప్‌/ బిల్‌ డెస్క్‌/ టీవ్యాలెట్‌/ ఫోన్‌పే ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని సూచించారు. అలాగే విద్యుత్‌ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే 79016 28367కు డయల్‌ చేయాలని తెలిపారు. logo